సీఎం కేసీఆర్ బీసీల పక్షపాతి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: సీఎం కేసీఆర్ బీసీల పక్షపాతి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. కోకాపేటలో నిర్మించబోయే బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణ స్థలాలను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. వెనుకబడిన కులాల కోసం సీఎం కేసీఆర్ ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు బీసీలను పట్టించుకోలేదని మంత్రి మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌లో బీసీల్లో ఒక్కో కులానికి జనాభా ప్రకారం ఐదు నుంచి పది ఎకరాల భూమి కేటాయించారని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ బీసీల ఆత్మగౌరవాన్ని కోరుకుంటున్నారని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణ స్థలాలను పరిశీలించామన్నారు. గత ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం బీసీల కొరకు గురుకులాలు, ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారనీ, ఈ సందర్భంగా మంత్రి సీఎం కేసీఆర్‌కు కృతజతలు తెలిపారు.
బీసీ కులాలకు పెద్దగా సీఎం కేసీఆర్ భవన నిర్మాణాలకు స్థలాలు కేటాయించారని మంత్రి అన్నారు. బీసీలకు అన్ని రకాలుగా సహాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపినట్లు ఆయన అన్నారు. కోకాపేట్‌లో 13 కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. భూమి పరిశీలన కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్‌తో పాటు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, వి. ప్రకాష్ ఉన్నారు.